Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ, నిరుద్యోగుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న తలపెట్టిన నిరుద్యోగ దీక్షను జయప్రదం చేయాలని బీజేవైఎం పిలుపునిచ్చింది. గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. యువమోర్చా రాష్ట్ర ఇన్చార్జి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఉద్యోగ నియామకాలు భర్తీ చేసేలా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు అధైర్యపడొద్దన్నారు. దీక్షలో బండి సంజరు కుమార్ పాల్గొంటారని తెలిపారు.