Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆపరేటర్ మృతి
- సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజే ఆర్జీ-3 ఓసీపీ 1లో విషాదం
నవతెలంగాణ - యైటింక్లైన్ కాలనీ
సింగరేణి ఆవిర్భావ వేడుకల రోజే ఓపెన్ కాస్టులో ప్రమాదం జరిగింది. రెండు డంపర్లు ఢకొీనడంతో ఆపరేటర్ మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఆర్జీ-3లో జరిగింది. సింగరేణి రామగుండం-3 ఏరియాలోని ఓసీపీ-1 క్వారీ ఏరియాలో గురువారం ఉదయం 5గంటల సమయంలో ఆగి వున్న ఒక డంపర్‌ను మరో డంపర్ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో డంపర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సింగరేణి కార్మికుడు కలిశెట్టి శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సింగరేణి అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.