Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి
- జూపార్కులో పక్షుల ఎవియారీ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నెహ్రూ జూపార్కు చిన్నపిల్లలు, పెద్దలకు ఆహ్లాదం పంచడంతో విజ్ఞానాన్ని అందజేస్తున్నదని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జూపార్కులో రూ.1.33 కోట్లతో నిర్మించిన పక్లు ఎవియారీని మంత్రి ప్రారంభించారు. నాలుగు వైల్డ్ డాగ్స్‌ను ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం వేలాది మంది సందర్శకులు జూ ను సందర్శిస్తున్నారనీ, ఎప్పటికప్పుడు కొత్త సౌకర్యాలను మెరుగు పరుస్తున్నామని చెప్పారు. పక్షి ప్రేమికులను ఆకట్టుకునేలా సహజసిద్ధంగా ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపించే అరుదైన పక్షి జాతికి చెందిన 680 రకాల పక్షులను ఉంచామని తెలిపారు. జూ పార్క్‌లో భద్రతావ్యవస్థను మెరుగుపరచడం, జూ ప్రాంగణంలో నిరంతర పర్యవేక్షణ, సందర్శకుల కదలికలు, జంతువుల ప్రవర్తనపై అధ్యయనం కోసం సెంట్రల్ జూ అథారిటీ, జపాట్ నిధుల్లో రూ.1.6 కోట్లు వెచ్చించి 200 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రెండో దశలో మరో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. జంతుమార్పిడి పద్ధతిలో కర్నాటక రాష్ట్రంలోని పిలికుల బయోలాజికల్ పార్క్, మంగళూర్ నుంచి నాలుగు వైల్డ్ డాగ్స్‌ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహదూర్ పూర్ ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్, పీసీసీఎఫ్ ఆర్. శోభ, అదనపు పీసీసీఎఫ్‌లు సిద్దానంద్ కుక్రేటీ, వినరు కుమార్, ఏ.కే.సిన్హా, సునీతా భగవత్, సీసీఎఫ్ ఎం.జె. అక్బర్, జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్, రిటైర్డ్ పీసీసీఎఫ్ బీఎస్ఎస్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.