Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-ములుగు
తొలితరం తెలంగాణ ఉద్యమం నాయకుడని కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం 7వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత అభివృద్ధికి కొండాలక్ష్మణ్ బాపూజీ అవిరళ కృషి చేశారన్నారు. ఆయన పేరుతో సిద్దిపేట జిల్లాలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామనీ, వర్సిటీ సమీపంలోనే మరో 140 ఎకరాలను సేకరించి అందజేస్తామని తెలిపారు. ఆయిల్ సీడ్, పప్పు దినుసు పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతుల ఖర్చు తగ్గి లాభాలు పెరిగే వంగడాలను అభివృద్ధి చేయాలని సూచించారు. హార్టికల్చర్ యూనివర్సిటీ నిధుల మంజూరు, రిక్రూట్మెంట్, భూ కేటాయింపులు.. తదితర సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మహమ్మద్ జాంగీర్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు జుబేర్ పాషా, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, ఎంపీటీసీ-2 లింగ హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.