Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్
సీపీఐ(ఎం) నిర్మల్ జిల్లా కార్యదర్శిగా రెండోసారి గౌతంకృష్ణ ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌కుమార్ గురువారం కమిటీని ప్రకటించారు. ఈ నెల 20న జరిగిన పార్టీ జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నామని తెలిపారు. నూతన జిల్లా కార్యదర్శిగా గౌతంకృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా దుర్గం నూతన్‌కుమార్, బొమ్మెన సురేష్, దాదారావు, శాంతి ఎన్నికయ్యారన్నారు. జిల్లా కమిటీ సభ్యులుగా ఇప్ప లక్ష్మణ్, డాకూరి తిరుపతి, ఎస్.అరవింద్, గంగా భవానీ, దొడ్డి రజిత, తొడసం శంభు, బలరాం ఎన్నికయ్యారు. పార్టీ యువత, మహిళలపై కేంద్రీకరించి పని చేయాలనీ, వర్గ పోరాటాలతో పాటు సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టి పని చేయాలని మహాసభల్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొమ్మెన సురేష్, జిల్లా కమిటీ సభ్యులు డాకూర్ తిరుపతి, అరవింద్, తొడసం శంభు పాల్గొన్నారు.