Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్స్ కోరుకున్నది అదే : నవతెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్
- ప్రపంచాన్ని మార్చే శస్త్రం 'క్యాపిటల్'...మార్క్సిజం ఆచరణ శాస్త్రం:
బుక్ఫెయిర్లో వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్
- ఆనందాచారి రచించిన రాజకీయ అర్థశాస్త్రం, మార్క్సిస్టు తాత్విక ఆలోచన పుస్తకాల ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమాజంలో కొందరే కాకుండా అందరూ బాగుండాలి.. ప్రతి ఒక్కరూ ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండాలని చెప్పిన మహనీయుడు కారల్ మార్క్స్ అని నవతెలంగాణ దినపత్రిక సంపాదకులు ఆర్.సుధాభాస్కర్ అన్నారు. మార్క్స్ రాసిన క్యాపిటల్ గ్రంథం ప్రపంచానికే దిక్సూచి అని తెలిపారు. ప్రస్తుత యువతలో ప్రశ్నించే స్వభావం తగ్గడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో లాటిన్ అమెరికా దేశాల్లో యువత మరింత చైతన్యవంతంగా ముందుకెళ్లడాన్ని ఆయన ప్రస్తావించారు. గత కొద్దిరోజులు గా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న బుక్ఫెయిర్లో గురువారం రచయిత కె.ఆనందాచారి రచిం చిన రాజకీయ అర్థశాస్త్రం, మార్క్సిస్టు తాత్విక ఆలోచన పుస్త కాల ఆవిష్కరణ కార్యక్రమం నవతెలంగాణ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు రాంపల్లి రమేశ్ అధ్యక్షతన జరిగింది. ఆ రెండు పుస్తకాలను వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాభాస్కర్ మాట్లాడుతూ.. అర్థశాస్త్రం, చరిత్రలను పనికిరాని సబ్జెక్టు లుగా చూసే వారి సంఖ్య నేటి సమాజంలో ఎక్కువై పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబానీ, ఆదానీ ఆస్తులు పెరుగుతున్నాయని చెబుకుంటు న్నారేగానీ.. వారి ఆస్తులు పెరగడానికి, పేదల బతుకులు మరింత దిగజారడా నికి కారణం ఎవరు అనే ఆలోచించే శక్తి నేటి యువతలో తగ్గుతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. ప్రధాని మోడీ భుజాల మీద ముఖేష్ అంబానీ చేతులు వేయడమేంటీ? రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ముందు పీఎం చేతులు కట్టుకుని ఎందుకు నిలబడ్డాడు? దాని వెనుకున్న మతలబు ఏంటి? అని ప్రశ్నించేతత్వం యువతలో కొరవడిందన్నారు. మనం అనే ఆలోచన పోయి నేను, నా కుంటుంబం అనే భావన పెరిగిపోయిందన్నారు. కానీ, మార్క్స్ ఏనాడూ అలా అనుకోలేదనీ, ఆయన అందరూ బాగుండాలని తపన పడ్డారని చెప్పారు. ఆ క్రమంలోనే క్యాపిటల్ గ్రంథం పుట్టుకొచ్చిందన్నారు. దోపిడీ ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందన్నారు. క్యాపిటల్‌ను సులభ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి రాజకీయ అర్థశాస్త్రం, మార్క్సిస్టు తాత్విక ఆలోచనా పుస్తకాలు పునాదిగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ..మార్క్సిజంపై భ్రమలు తొలగిపోయాయి. .దానికి కాలం చెల్లిందని విషప్రచారాలు చేసినవారే సబ్‌ప్రైమ్ సంక్షోభ సమయంలో పరిష్కార మార్గం కోసం కారల్ మార్క్స్ రాసిన క్యాపిటల్ గ్రంథాన్ని వెతికి మరీ అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పెట్టుబడిదారీ సంక్షోభాల వల్ల ప్రపంచానికి పట్టిన జబ్బును గుర్తించడానికి, సర్వరోగనివారణి మాత్రగా ఉపయోగడేది ఆ గ్రంథమే అని నొక్కిచెప్పారు. అది ప్రపంచాన్ని మార్చే గొప్ప శస్త్రం అని కొనియాడారు. దానికి మరణం లేదని స్పష్టం చేశారు. మార్క్సిజం ఒక దర్శనశాస్త్రమనీ, ఆచరణ శాస్త్రమని చెప్పారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే బ్రిటీష్ రాజకీయ అర్థశాస్త్రం, జర్మన్ తత్వశాస్త్రం, ఫ్రెంచ్ సోషలిజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. 1842 నుంచి చనిపోయేవరకూ మార్క్స్ పుస్తకాలు రాస్తూనే ఉన్నాడనీ, ప్రతిరోజూ ఆయన బ్రిటీష్ లైబ్రరీలో రోజుకు 12 నుంచి 16 గంటల పాటు అధ్యయనం చేశాడని వివరించారు. మార్క్స్, ఏంగెల్స్ రచనలు 50వేల వ్యాల్యూమ్స్(40 వేల పేజీలు) ముద్రించారనీ, ఇంకా ప్రచురణకు నోచుకోనివి ఎన్నో ఉన్నాయని తెలిపారు. తెలుగులో వారి రచనలు చాలా తక్కువ వచ్చాయనీ, అందులోనూ గుగ్గిళ్ల లాంటి అనువాదాలు అందరికీ జీర్ణం అయ్యేలా లేవని చెప్పారు. కానీ, ఆనందాచారి క్యాపిటల్ గ్రంథాన్ని జీర్ణం చేసుకుని తన రెండు పుస్తకాల్లోనూ తెలుగు నుడికారంలో పెట్టి చాలా చక్కగా వివరించారని ప్రశంసించారు. ఆ పుస్తకాల్లో సరళశైలి, చిన్నచిన్న వాక్యాలను వాడటమే కాకుండా సందర్భోచితంగా వేమన పద్యాలను, కవితలను వాడటం బాగుందని కొనియాడారు. ఆకలి తీర్చుకోవడం కోసం చేసిన మామిడికాయల దొంగతనం, ఆర్టీసీ సమ్మెను ఉదహరణలు పెట్టి అందరికీ అర్థమయ్యే రూపంలో రాశారన్నారు. పుస్తక రచయిత, నవతెలంగాణ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు కె.ఆనందాచారి మాట్లాడుతూ..సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు కారణాలను విప్పి చెప్పిన మేధావి మార్క్స్ అని కొనియాడారు. మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని చాలెంజ్ చేసి ఇదే ప్రత్యామ్నాయం అని చెప్పేది రాలేదని చెప్పారు. కోవిడ్ కాలంలో కోట్లాది మంది ఉద్యోగాలు పోవడం, సంక్షోభాలు ముంచుకువస్తున్న నేపత్యంలో క్యాపిటల్ ఆవశ్యకత మరింత పెరిగిందన్నారు. ప్రపంచం లోని మానవులందర్నీ ప్రేమించిన వ్యక్తి మార్క్స్ అన్నారు. తాను రెండు పుస్తకాలను తేవడానికి ఎంతో అధ్యయనం చేశానని తెలిపారు. బుక్‌ఫెయిర్ కార్యదర్శి, నవతెలంగాణ బుకహేౌస్ జనరల్ మేనేజర్ కె.చంద్రమోహన్ మాటా ్లడుతూ..కవులను కడుపులో పెట్టుకుని చూసుకోవడంలో ఆనందాచారికి మించిన వారు లేరని కొనియాడారు. కోవిడ్ కాలంలో కష్టమైనప్పటికీ ఆ రెండు పుస్తకాల ముద్రణకు పూనుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ ఎడిటోరియల్ బోర్డు సభ్యులు అనంతోజు మోహన్‌కృష్ణ, కవి తంగిరాల చక్రవర్తి పాల్గొన్నారు.