Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు సంస్థలిచ్చిన పరికరాలూ నిరుపయోగం
- వినియోగంలో లేని ఎల్ అండ్ టి ఆక్సిజన్ జనరేటర్
- 'గెయిల్' ముందుకొచ్చినా.. ప్రతిపాదనలు కరువు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజీఎం)లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రికి పలు సంస్థలు అధునాతన పరికరాలను విరాళంగా ఇస్తున్నా వాటిని ఉపయోగించుకునే స్థితిలో ఆస్పత్రి వర్గాలు లేవు. దాంతో సంస్థలు ఇచ్చే పరికరాలు నిరుపయోగంగా ఉండటం గమనార్హం. ఎల్ అండ్ టీి కంపెనీ విరాళంగా ఇచ్చిన ఆక్సిజన్ జనరేటర్ నేటికీ నిరుపయోగంగా ఉంది. గత ఏడాది 'గెయిల్' అనే ప్రభుత్వ రంగ సంస్థ ఎంజీఎంకు రూ.3 కోట్ల విలువైన పరికరాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఆస్పత్రికి ఎలాంటి పరికరాలు అవసరమో, ప్రతిపాదనలను ఇవ్వడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఇది పేదల ఆస్పత్రి దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆస్పత్రిలోని బయో మెడికల్ పరికరాల మెయింటెనెన్స్‌పై దృష్టి సారించకపోవడంతో పేదలకు అవసరమైన వైద్య సేవలందడం లేదు.
అటకెక్కిన ఆక్సిజన్ జనరేటర్
గతంలో ఎంజీఎం ఆస్పత్రికి ఎల్ అండ్ టి కంపెనీ ఆక్సిజన్ జనరేటర్‌ను విరాళంగా ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు దాన్ని వినియోగించకుండా మూలనపడేశారు. 1000 పీపీఎం సామర్ధ్యం కలిగిన ఈ ఆక్సిజన్ జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.33 లక్షల నిధులు అవసరమవుతాయని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. ఈ ఆక్సిజన్ జనరేటర్ సామర్థ్యాన్ని బట్టి ఎలక్ట్రికల్ పనులు, దాన్ని ఉంచడానికి ఓ షెడ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటికి కావాల్సిన రూ.33లక్షలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నేటికీ ఆ జనరేటర్ వినియోగంలోకి రాని పరిస్థితి.
'గెయిల్' రూ.3 కోట్లతో ముందుకొచ్చినా..
ప్రభుత్వ రంగ సంస్థ అయిన గెయిల్.. గతేడాది ఎంజీఎం ఆస్పత్రికి రూ.3కోట్ల విలువైన అధునాతన పరికరా లను విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ కంపెనీ ప్రతిపాదించిన సమయంలో కరోనా ఉధృతి, లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర జాప్యం జరిగింది. ఉధృతి తగ్గినా తర్వాతయినా ఆస్పత్రికి అవసరమైన పరిక రాల వివరాలను ఆస్పత్రి వర్గాలు గెయిల్ సంస్థకు ఇవ్వలేదు. ఈ సమయంలో ఎంజీఎం సూపరిం టెండెంట్‌గా ఉన్న డాక్టర్ బి. శ్రీనివాసరావు కోవిడ్ ఉధృతి నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ నాగార్జునరెడ్డి బాధ్యతలు స్వీకరించినా, ఎలాంటి ప్రతిపాదనలను 'గెయిల్'కు సమర్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ నాగార్జునరెడ్డిని తప్పించి డాక్టర్ వి. చంద్రశేఖర్‌ను ఎంజిఎం సూపరింటెండెంట్‌గా నియ మించింది. డాక్టర్ చంద్రశేఖర్ మాత్రం ఆస్పత్రికి సంబంధించిన నిధులు, వాస్తవ పరిస్థితిని గమనించి ముందుకొచ్చిన సంస్థలకు బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (బిఓటి) పద్దతిలో ఇస్తే పేదలకు మెరుగైన వైద్యసేవలందించడానికి అవకాశముంటుందని ప్రతి పాదించినట్టు సమాచారం. చంద్రశేఖర్ కేవలం ఆరు నెలలు మాత్రమే సూపరింటెండెంట్‌గా కొనసాగారు. తాజాగా ఆయన స్థానంలో గతంలో పదవికి రాజీనామా చేసిన డాక్టర్ బి. శ్రీనివాసరావును రాష్ట్ర ప్రభుత్వం సూపరింటెండెంట్‌గా నియమించింది. తరుచూ సూపరింటెండెంట్లు మారడం వల్ల ఆస్పత్రి పాలనా అస్తవ్యస్తంగా మారింది.
తాజా పరిస్థితి తెలియదు
'గెయిల్' సంస్థ రూ.3 కోట్ల విరాళానికి సంబంధించి ఎలాంటి కొనుగోళ్లు జరిగాయో తాజా పరి స్థితి నాకు తెలియదు. గతంలో నేను సూపరింటెం డెంట్‌గా ఉన్నప్పుడే 'గెయిల్' సంస్థ అధునాతన పరి కరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కోవిడ్ ఉధృతితో లాక్డౌన్ పరిస్థితితో ఎలాంటి ప్రతిపాద నలు చేయలేదు. నేను తప్పుకున్నాక ఏం జరిగింద నేది తెలియదు. ఈ విరాళంతో బయో మెడికల్ పరికరాలనే కొనుగోలు చేయాల్సి ఉంది. ఏసంస్థ అయినా పరికరాల కొను గోలుకు డబ్బులు ఆస్ప త్రి ఖాతాకు ఇవ్వదు. ఆసంస్థనే ఏజెన్సీ ద్వారా పరికరాలను కొనుగోలు చేసి ఆస్పత్రికి అంద చేస్తుంది.
- డాక్టర్ బి. శ్రీనివాసరావు, ఎంజీఎం సూపరింటెండెంట్