Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్ ఆంక్షలు విధించండి
- తద్వారా జనాన్ని అప్రమత్తం చేయండి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పలు దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకునేందుకు అంక్షలు విధించేలా రెండు లేదా మూడు రోజుల్లోఉత్తర్వులను జారీ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత నెల21న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శ కాలను అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. కోవిడ్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. క్రిస్మస్,న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండుగలకు జనం గుమిగూడకుండా ఉత్తర్వులను వెలువరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. రెండు మూడు రోజుల్లో వాటిని విడుదల చేసి జనాన్ని అప్రమత్తం చేయాలని చెప్పింది. గత సంవత్సరం కరోనాపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను గురువారం ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ విచారిం చింది. పిటిషనర్ల తరపులాయర్లు వాదిస్తూ, క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగలు రాబోతున్నాయనీ, జనం వేడుకల్లో పాల్గొనేం దుకు పెద్దఎత్తున గుమిగూడితే వైరస్ వ్యాప్తివల్ల ప్రతికూల పరిణా మాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు.
వైరస్ వ్యాప్తి అయితే ప్రమాద ఘంటికలు మోగే అవకాశాలుంటాయని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే పలు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉండొచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల ఆందోళనను అర్ధం చేసుకోదగ్గదనీ, మన దగ్గర ఆంక్షలను విధించ కపోతే పరిస్థితి చేజారిపోయే ప్రమాదముంటుం దని కోర్టు వాఖ్యానిం చింది. ఇతర రాష్ట్రాల నుంచి, దేశవిదేశాల నుంచి వచ్చే వాళ్లకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. రైల్వే, బస్ స్టేషన్లల్లో పరీక్షలు చేయాలని చెప్పింది. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కారణంగా పరిస్థితులను అధ్యయనం చేసి రాష్ట్రాలను అప్రమత్తం చేసేందుకు కేంద్రసర్కార్ వైద్యబృందాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేసింది. ఆయా బృందాలు ఇచ్చే సలహాలు, సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.