Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
అప్పుల బాధకు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శంకర్తండా గ్రామానికి చెందిన (ఆళ్వార్బండ తండా) రైతు లకావత్ లాలూ(50) తనకున్న వ్యవసాయ భూమిలో సాగుకు బ్యాంకులు, ప్రయివేటు వ్యక్తుల నుంచి రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. ఈఏడాది వ్యవసాయం అనుకూ లించకపోగా తెచ్చిన అప్పులు రెట్టింపవుతున్నాయని మనోవేదనకు గురై గురువారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి పడుకున్నాడు. ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబీకులు అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు కోరారు.