Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సైన్స్ సిటీ ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి లేఖ రాశారు. కేంద్ర పథకం ఎస్పీఓసీఎస్ కింద సైన్స్ సిటీ అభివృద్ధికి అవకాశం ఉందని తెలిపారు. సైన్స్ సిటీ ఏర్పాటుతో హైదరాబాద్ వైజ్ఞానిక హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో హైదరాబాద్ మరో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుందని తెలిపారు. సౖన్స్ కల్చర్‌ను ప్రోత్సహించే పథకం కింద వెంటనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని సీఎం కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి కోరారు.