Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి
యూపీ సింగ్‌కు దాసు సురేశ్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేనేత వస్త్రాలపై విధించనున్న 12 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని బీసీ సంఘం కార్యానిర్వాహక అధ్యక్షులు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. అనేక సమస్యలతో విలవిలాడుతున్న చేనేత వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించా లని కోరారు. శుక్రవారం ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్లో కేంద్ర జౌళీ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ను కలిశారు. వ్యవసాయం తర్వాత కోట్ల మంది నేతన్నలకు ఉపాది అవకాశాలను కల్పిస్తున్న చేనేత జౌళి రంగాన్ని ప్రభుత్వాలు వాణిజ్య, వ్యాపార దృక్పథంతో చూడడం సరికాదని దాసు సురేశ్ పేర్కొన్నారు. నకిలీ చేనేత వస్త్రాలు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తూ చేనేత కార్మికుల పొట్టగొడుతున్నాయని తెలిపారు. ప్రతి చేనేత వస్త్రానికి హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్‌లతో పాటు నేసిన చేనేత కార్మికుడి జియో టాగ్ నంబర్‌ను జతచేసి నకిలీలను అరికట్టాలని విన్నవించారు. నేతన్నలందరికీ ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు, పెట్టుబడి సాయం, ఇన్సూరెన్స్, హెల్త్‌కార్డులు, పక్కా ఇండ్లు ఇవ్వాలని కోరారు. ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఎక్స్‌గ్రేషియా ద్వారా ఆదుకోవాలన్నారు. ఈ విషయాలను సంబంధిత మంత్రి పీయూష్ గోయల్, జీఎస్టీ కౌన్సిల్, ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్తానని యూపీ సింగ్ హామీనిచ్చారని తెలిపారు.