Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సినిమా టిక్కెట్ల ధరలను సవరిస్తూ జీవో జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. న్యాయవాది జీఎల్ నర్సింహారావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎన్ తుకారాంజీతో కూడిన డివిజన్ బెంచ్ ముగించింది. కొత్త జీవోను ఉల్లంఘిస్తే మళ్లీ కోర్టుకు రావటానికి వీలుగా పిటిషనర్‌కు వెలుసుబాటు కల్పించింది. సినిమా రిలీజ్ సమయంలో టిక్కెట్ల రేట్లను పెంచుకునేందుకు వీలుగా గతంలో థియేటర్లలో పొందిన మధ్యంతర ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని, దీనిపై విచారణ చేయాలంటూ పిటిషనర్ చేసిన వినతిని తిరస్కరించింది. వాటిని ఏ విధంగా ఉల్లంఘించారనే దానిపై ఆధారాలతో మరో కేసు దాఖలు చేసుకోవాలంటూ సూచించింది. ప్రస్తుతం జీవో ఇచ్చిన నేపథ్యంలో ప్రజాహిత వ్యాజ్యంలో తఉత్తర్వులు అవసరం లేదని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. కాగా సీబీఐ దర్యాప్తు చేసిన కేసుకు సంబంధించి.. ఒకసారి చార్జిషీటు సమర్పిస్తే తిరిగి ఆ కేసును విచారించి అదనపు చార్జిషీటు దాఖలు చేయడానికి వీల్లేదంటూ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో వాదించారు.