Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈవో కార్యాలయం ఎదుట జూనియర్ ఉపాధ్యాయులు నిరసన
నవతెలంగాణ- నల్లగొండ
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను వెంటనే రద్దు చేయాలని సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల జూనియర్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. స్థానికులకు నష్టం కలిగించే జీవోను వెంటనే రద్దు చేసి స్థానికులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి స్థానిక ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. సీనియర్లకు అవకాశం కల్పించినట్టే జూనియర్లకు కూడా అవకాశం కల్పించాలన్నారు. ఈ అవకాశం కల్పించకపోవడంతో చంటి పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో దూరప్రాంతాలకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 317ను రద్దు చేసి సొంత జిల్లాలో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.శ్రీను, జి.నాగరాజు, నాయిని జగన్, సంధ్యారాణి, శ్రీధర్, శ్రీనివాస్, జ్యోతి, శిరీష, పారిజాత, జ్యోతి, వాణి, లావణ్య, అనూష, రఘు, సూర్యం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.