Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం రామయ్యకు స్వర్ణ భద్ర కవచ ధారణ అలంకరణ నిర్వహించారు. తెల్లవారుజామున 4.30గంటలకు ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాతం, ఆరాధన, సేవా కాలం, నివేదన తదితర నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం అంతరాలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తులను మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ బేడా మండపానికి తీసుకొని వచ్చారు. తదుపరి నిత్యకల్యాణమూర్తులకు వైష్ణవ సంప్రదాయం ప్రకారం విశ్వక్సేన ఆరాధన, పుణ్య్ణవాచనతో నిత్యకల్యాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి కంకణధారణ, జీలకర్ర, బెల్లం, కన్యాదానం, మంగళసూత్ర ధారణ తదితర కార్యక్రమం నిర్వహించారు.