Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత శుక్రవారం హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్‌లు గంప గోవర్ధన్, ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తనపై విశ్వాసంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తానని చెప్పారు. మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆకుల లలిత హామీనిచ్చారు.
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మెన్‌గా సాయిచందర్ బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మెన్‌గా సాయి చందర్ శుక్రవారం బాధ్య తలు చేపట్టారు. కార్యక్రమం లో మంత్రి హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, టీఎస్ఎమ్ఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాయిచందర్కి మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకులకు సరైన గుర్తింపు ఇచ్చారని అన్నారు.ఆయన ఇచ్చిన అవకాశానికి వన్నె తెచ్చేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.