Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమినార్లో కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదిపత్యంపై పోరాటమే పెరియార్‌కు నిజమైన నివాళని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు తెలిపారు. సికింద్రాబాద్‌లోని రైల్వే వర్క్‌షాపులో శుక్రవారం ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెరియార్ 48వ వర్థంతి సందర్భంగా సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా స్కైలాబ్ మాట్లాడుతూ శ్రమజీవుల మీద ఆధిపత్యం చేయడం కోసం కులాలను, పుక్కిటి పురాణాలను సృష్టించి కర్మ, ధర్మ సిద్ధాంతాలతో రాజ్యమేలుతున్న మనువాద శక్తుల ఆటకట్టించేందుకే పెరియార్ పనిచేశారని చెప్పారు. ఆత్మగౌరవ ఉద్యమానికి ఆయన పితామహుడని తెలిపారు. నేటి తరానికి స్ఫూర్తిప్రదాతని పేర్కొన్నారు. బాల్య వివాహాలపై పోరాటం చేస్తూ, అర్థం కాని మంత్రాలు తంత్రాలతో హిందూ పెళ్ళి సాంప్రదాయాలను వదిలేయాలంటూ సూచించారని వివరించారు. హేతువాదం శాస్త్రీయ దష్టితోనే సమగ్రత లభిస్తుందని తెలిపారు. బుద్ధుడు, లెనిన్ తనకి స్ఫూర్తి ప్రధాతలంటూ పెరియార్ ప్రకటించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.బంధు సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి, బహుజన ఉద్యమ నాయకుడు రాజయ్యలు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు సెమినార్‌కు రైల్వే ఓబీసీ అసోసియోషన్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్ అధ్యక్షత వహించారు అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.