Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసీసీ చీఫ్ రేవంత్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గత మూడు నెలలుగా రైతులు గోస పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని చెప్పారు. కల్లాలు, వరి కుప్పలు, ఇంటి ముందు అన్నదాతలు అరణ్యరోదనలు తెలంగాణలో నిత్యకృత్యాలు అయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 27న గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో తన నివాసంలో పార్టీ నేతలు బలరాంనాయక్, వేం నరేందర్‌రెడ్డి, నర్సారెడ్డి, హర్కర వేణుగోపాల్‌తో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా మోడీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. వరంగల్ గోడౌన్లో 25వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్‌మాల్‌పై కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ ప్రశ్నించడంలో టీఆర్ఎస్ నాయకులు దొంగల్లా పారిపోయి వచ్చారని విమర్శించారు. బీజేపీకి చావుడప్పు కార్యక్రమంలో కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్‌రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు.ధాన్యం సమస్య పరిష్కారమయ్యేవరకు ఢిల్లీకి వెళ్లిన మంత్రులు అక్కడ ఎంజారు చేస్తున్నారని విమర్శించారు. యాసంగి పంట గురించి ఎందుకు నిలదీయడం లేదంటూ వారిని ప్రశ్నించారు. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్‌రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే మంత్రులు బృందంలో వారు లేరని చెప్పారు. ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. కేంద్రంతో ఏ విషయాన్ని తేల్చుకోకుండా హైదరాబాద్‌కు వస్తే మిమ్మల్ని గాజులు, చీరెలతో స్వాగతం పలకాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
విద్యార్థులను పాస్ చేయడం సంతోషం
సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి కృతజ్ఞతలు
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పాస్ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 2.36 లక్షల మంది విద్యార్థులను పాస్ చేయడం సంతోషంగా ఉందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత పదిరోజుల నుంచి విద్యార్థులు, తల్లితండ్రుల్లో ఉన్న ఆందోళనను తొలిగించడం పట్ల హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్టు తెలిపారు.