Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. నూతన స్థానికతకు అనుగుణంగా బదిలీలు, పోస్టింగులకు సంబంధిం చిన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల బదిలీలను చేపట్టి, పోస్టింగులను ఇవ్వనున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. నూతన స్థానికత ఆధారంగా సీని యార్టీ జాబితాలను అధికారులు రూపొందించనున్నారు. ఇదే సమయం లో ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని ప్రభుత్వం ఈ సందర్భం గా స్పష్టం చేసింది. ఇందుకనుగుణంగా జిల్లా కల్టెక్టర్లు, శాఖాధిపతులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు. వారం రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. బదిలీలు, పోస్టింగుల తర్వాత విధుల్లో చేరేందుకు ఉద్యోగులకు మూడు రోజుల గడువునివ్వనున్నారు. మరోవైపు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల కోసం ప్రభుత్వం విడివిడిగా మార్గదర్శ కాలను జారీ చేసింది. పోలీస్, ఎక్సైజ్, స్టాంపులు, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖలు అవసరమైతే విడిగా మార్గదర్శకాలు జారీ చేయవ చ్చని ప్రభుత్వం పేర్కొంది. బదిలీల ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించింది. టీజీవో, టీఎన్జీవో, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రత్యేక కేటగిరి, స్పౌస్ (భార్యాభర్తల) దరఖాస్తులకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది.