Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాజులు,చీరలు పంపిన కాంగ్రెస్ మహిళా నేతలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కష్టాల్లో ఉన్న రైతులను టీఆర్ఎస్, బీజేపీ నాయకులు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధులు కల్వ సుజాత, రవళి విమర్శించారు. ఢిల్లీలో అగ్గిపుట్టిస్తామంటూ వెళ్లిన మంత్రులు ఉత్తచేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. వారు తమ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చీర, గాజులేసుకుని ఇంట్లో కూర్చొవాలని మంత్రులకు సూచించారు. శనివారం గాంధీభవన్లో వారు మంత్రులకు, టీఆర్ఎస్ నాయకులకు పంపించిన చీరలు,గాజులను మీడియాకు విడుదల చేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాలుగు రోజులు...మంత్రులు వారం రోజులు ఢిల్లీలో ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. రైతాంగ సమస్యలు తీర్చే వరకు ఢిల్లీని వదలబోమన్న నాయకులు ఎందుకు తిరిగొచ్చారని నిలదీశారు. మంత్రులను ఆడవారితో పోల్చాలంటే అవమానంగా ఉందంటూనే...పీసీసీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు వారికి చీరలు, గాజులు పంపిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో రాక్షస క్రీడ ఆడుతున్నాయని విమర్శించారు.