Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గృహ హింస కేసులు రెండు రెట్లు...
- డయల్ '181'కి పెరిగిన కాల్స్ ొ డ్వాక్రా మహిళలకు రూ.4,200 కోట్ల బకాయిలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సభ్య సమాజం తలదించుకునేలా ఈ యేడాది కూడా రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు కొనసాగాయి. హైదరాబాద్‌లో చిన్నారి చైత్ర ఘటన... యావత్ దేశాన్నే నివ్వెర పరిచింది. 2021లో గహహింస కేసులు గతేడాది కంటే రెండు రెట్లు ఎక్కువయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి 'డయల్-100' ఫోన్‌కాల్స్ విశ్లేషణలో పలు అంశాలు వెల్లడయ్యాయి. రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్‌లో 12 శాతం మహిళలపై వేధింపులు, దాడులకు సంబంధించినవే (రోజుకు సగటున 450) ఉండటం కలవరపరిచే అంశం. వీటిలో 250 వరకు గహహింసకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇందులోంచి అనేక కాల్స్‌ను డయల్ '181'కు కౌన్సిలింగ్ కోసం బదిలీ చేస్తున్నారు. మహిళలపై దాడులకు సంబంధించి 2016లో 59,000 ఫోన్‌కాల్స్ రాగా.. 2021 నవంబరు నాటికి వాటి సంఖ్య 2,60,000కు చేరింది. ఉమన్ హెల్ప్‌లైన్(181)కు రోజుకు సగటున 800 కాల్స్ వస్తున్నాయి. లాక్డౌన్ తరవాత '181'కు అత్యవసర కాల్స్ పెరిగాయి.
కమిటీ వేసినా ఫలితం లేకపాయే...
'దిశ' ఉదంతం తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యల కోసం ప్రభుత్వం అత్యున్నత కమిటీని నియమించినప్పటికీ మహిళలు, చిన్నారులపై దాడులు, అగాయిత్యాలను అరికట్టలేకపోయారు. ఏదైనా ఘటన జరిగిన తర్వాత మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన చేపడితేనే నిందితులకోసం అన్వేషణ కొనసాగిస్తున్నారన్న విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది.
సంక్షామమే...
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్లు రాష్ట్రంలో సరిగ్గా అందటం లేదు. నెలనెలా వాటిని సర్కారు విడుదల చేయకపోవటంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు 57 సంవత్సరాలు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లను ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు, దరఖాస్తుల స్వీకరణకు గడువును తొందరగా ముగించటంతో... బ్యాంకు అకౌంట్లు లేని అనేక మందికి అవకాశం లేకుండా పోయింది.
'హుజూరాబాద్'కు రూ.54 కోట్లు...
డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన వడ్డీ మొత్తాలకు సంబంధించి ప్రభుత్వం రూ.4,200 కోట్లు బకాయి పడింది. అయితే హుజూరాబాద్ ఎన్నికల సమయంలో అక్కడ పొదుపు గ్రూపులకు రూ. 54 కోట్లను విడుదల చేయటం గమనార్హం.