Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగను పట్టుకున్న మరో మహిళ
- దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
కిరాణా షాప్‌కు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. షాపులోని మహిళ కండ్లల్లో కారం చల్లి.. ఆమె మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా.. మరో మహిళ ధైర్యం చేసి దుండగున్ని పట్టుకుంది. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శివాజీ రోడ్డు చౌరస్తాలో ఏటీఎం వద్ద కృష్ణమూర్తి అనే వ్యక్తి కిరాణ షాప్ నిర్వహిస్తున్నాడు. ఉదయం అతని భార్య కిరణ్ షాప్ తెరుస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై వచ్చాడు. జేబులో చేతులు పెట్టి డబ్బులు ఇస్తున్నట్టు నటించి షాప్‌లో వస్తువులు కావాలని అడిగాడు. వెంటనే కారం పొడి ఆమె కండ్లల్లో చల్లాడు. మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని బైక్‌పై పారిపోయేందుకు ప్రయత్నించాడు. భారతి అనే మహిళ దొంగను పట్టుకొని అతని జేబులోని కారం తీసి దొంగ కండ్లల్లోనే కొట్టి కేకలు వేయడంతో స్థానికులు పరిగెత్తుకొచ్చారు. అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీసులకు అప్పగించారు.