Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్లలో జూనియర్ ఉపాధ్యాయుల ధర్నా
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
జూనియర్ ఉపాధ్యాయులకు నష్టం కలిగించే 317జీవోను వెంటనే రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జూనియర్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.శనివారం జూనియర్ ఉపాధ్యాయులు సిరిసిల్ల పట్టణంలో ర్యాలీ నిర్వహి ంచి అంబేద్కర్ గాంధీచౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం తీసుకొచ్చిన 317జీవో వల్ల జూనియర్ ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సొంత జిల్లాలో ఉద్యోగాలు చేయకుండా పక్క జిల్లాలో పని చేయాల్సిన పరిస్థితి నేర్పడుతుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి 317 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.