Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు స్నేహితులు.. మరో వ్యక్తి
నవతెలంగాణ-ఉట్నూర్, నార్నూర్
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢకొీని.. ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరితండా సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన జాదవ్ సుశ్విన్(21), కొటంబే భావేశ్(21) ఇంద్రవెల్లి మండలంలో శుభకార్యానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అదే సమయంలో పెర్కగూడ గ్రామానికి చెందిన దుర్గం నరేశ్(22) భార్య రజినీతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఉట్నూర్ నుంచి ఇంద్రవెల్లి చర్చికి రాత్రి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. కుమ్మరితండా గ్రామ సమీపంలోకి రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢకొీన్నాయి. ద్విచక్రవాహనాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఆ ప్రాంతంలో రోడ్డంతా రక్తంతో నిండిపోయింది. ఆ సమయంలో వచ్చిన ప్రయాణికులు ప్రమాదాన్ని చూసి 108కు, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి జాదవ్ సుశ్విన్, కొటంబే భావేశ్ ఘటన స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నరేశ్, రజినీని ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. నరేశ్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. జాదవ్ సుశ్విన్, కొటంబే భావేశ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను జడ్పీ చైర్మెన్ రాథోడ్ జనార్ధన్ పరామర్శిం చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసల కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుర్గం నరేశ్‌కు ఆరు నెలల కిందటే రజినీతో వివాహం జరిగింది.