Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్న రైతు
నవతెలంగాణ-మల్హర్రావు
ఆన్లైన్లో భూమి పట్టా ఇప్పిస్తామని నమ్మించి రూ.40 వేలు తీసుకుని ఎంపీటీసీ భర్త భూక్య రఘునాయక్, టీఆర్ఎస్ నాయకులు తనను మోసం చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం ఆన్సాన్పల్లి గ్రామానికి చెందిన రైతు పాతపల్లి చంద్రు శనివారం విలేకరుల ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముత్యాల సదానందం, పెద్దతూండ్ల గ్రామ సింగిల్ విండో మాజీ డైరెక్టర్ జక్కు లక్ష్మణ్ తనను మోసం చేశారని చెప్పాడు.భూక్య రఘునాయక్ రూ.20 వేలు, ముత్యాల సదానందంతోపాటు పెద్దతూండ్ల గ్రామానికి చెందిన జక్కు లక్ష్మణ్‌కు రూ.20 వేలు డిజిటల్ పట్టాలు చేయిస్తానంటే ఇచ్చానని చెప్పారు. పట్టా బుక్కులు ఇప్పించాలని లేదా డబ్బులు ఇవ్వాలని ప్రాధేయపడ్డా నాలుగేండ్లుగా పట్టించుకోవడం లేదని వాపోయాడు. గ్రామ శివారులోని సర్వే నెంబరు 40లో తన తండ్రి ద్వారా సంక్రమించిన ఆరెకరాల భూమిని దున్నుకుని జీవిస్తున్నామన్నా రు. కానీ, పంటల దిగుబడి లేక ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఆన్లైన్లో పట్టా పాస్బుక్కు ఇప్పిస్తామంటే రూ.50వేలు అప్పు తెచ్చి ఇచ్చానని రైతు చెప్పాడు. తనను మోసం చేసిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరాడు.