Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జన సేవాదళ్ రాష్ట్ర నాయకులు, ఏఐవైఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ కార్యదర్శి తోట విజరు అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విజరు యువజన ఉద్యమంలో కీలక పాత్ర వహించాడని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేవాదళ్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడంలో విజరు పాత్ర మరువరానిదని పేర్కొన్నారు. నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన యువ నాయకుడిని కోల్పోవడం విచారకరమని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కమిటీ తరఫున విజయ్ మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.