Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో అందచేసిన కేంద్రమంత్రి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బొగ్గు మైనింగ్ రంగంలో అత్యుత్తమ వ్యాపార విలువలు పాటిస్తున్నందున సింగరేణి కాలరీస్‌కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా(ఐఈఐ) ఇండిస్టీ ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. ఐఈఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 36వ ఇండియన్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ కార్యక్రమం ఆదివారం జరిగింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సింగరేణి జనరల్ మేనేజర్ (సీపీపీ) కే నాగభూషణ్రెడ్డికి ఈ అవార్డును అందచేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఈఐ అధ్యక్షుడు నరేంద్రసింగ్ మాట్లాడుతూ ఉత్తమమైన వాణిజ్య విలువలు పాటిస్తున్నందుకు సింగరేణిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. అవార్డును అందుకున్న సింగరేణి జీఎం(సీపీపీ) కే నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ బొగ్గు మైనింగ్ రంగంలోనే కాకుండా 1,200 మెగావాట్ల థర్మల్, 300 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి రంగాల్లోకీ అడుగుపెట్టిందన్నారు. కంపెనీకి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు లభించాయని తెలిపారు.