Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడారంగానికి తీరని లోటు : మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, తొలి అర్జున అవార్డు గ్రహీత జమ్మలమడక పిచ్చయ్య (104) ఆదివారం కన్నుమూశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో తన మనుమని ఇంట్లో ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు. కాగా, పిచ్చయ్య భౌతికకాయానికి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వరంగల్ కొత్తవాడలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పిచ్చయ్య మృతి క్రీడారంగానికి తీరని లోటని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు పిచ్చయ్య కుటుంబసభ్యులకు ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. బాల్ బ్యాడ్మింటన్లో రాష్ట్రం నుంచి అనేక మందిని రాష్ట్ర, జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి కృషి చేశారని కొనియాడారు. మరి కొంతమంది ప్రముఖులు ఆయన మృతి సందర్భంగా ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.