Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ మృతి
- హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమం
నవతెలంగాణ-వెంకటాపురం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం పోలీస్‌స్టేషన్ ఆవరణలోని సీఆర్పీఎఫ్ ఏ39 క్యాంప్‌లో ఆదివారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ మధ్య భోజనం తయారీ విషయంలో వాగ్వాదం జరి గింది. దాంతో క్షణికావేశంతో కానిస్టేబుల్ ఎస్ఐపై కాల్పులు జరిపి తానూ కాల్చుకున్నాడు. ఎస్ఐ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ చెందిన ఎస్ఐ ఉమేష్ చంద్ర, తమిళనాడు చెందిన కంపెనీ హెడ్ కానిస్టేబుల్, మెస్ ఇన్చార్జి స్టీఫెన్ మధ్య మెగాహాల్లో టిఫిన్ చేసే సమయంలో గొడవపడ్డారు. దాంతో కోపోద్రిక్తుడైన హెడ్ కానిస్టేబుల్ తన ఏకే 47 తుపాకీతో ఎస్ఐపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం తనూ అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దాంతో స్థానిక పోలీసులు.. ఇద్దరినీ ఏటూరునాగారంలోని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఉమేష్ చంద్ర మార్గమధ్యలో మృతి చెందాడు. తల, ఛాతీ భాగంలో తీవ్రంగా గాయాలవడంతో స్టీఫెన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దాంతో కానిస్టేబుల్ స్టీఫెన్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న సీఆర్పీఎఫ్ సెంట్రల్ జోన్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా, ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్, ఏటూరు నాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్ సంఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.