Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎంపీ పర్యటనకు సెగలు
- రైతులను మోసం చేశావంటూ ఘెరావ్
నవతెలంగాణ-డిచ్పల్లి
పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసిన ఎంపీ అరవింద్.. ఏ ముఖం పెట్టుకొని పర్యటనలకు వస్తున్నారంటూ టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అడ్డుకు న్నారు. ఎంపీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన కారు ఎదుట బైటాయించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారంలో శ్మశానవాటిక, పల్లెపకృతి వనం ప్రారంభోత్సవాలకు ఆదివారం వచ్చిన ఎంపీ అరవింద్ కాన్వారును టీఆర్ఎస్ శ్రేణులు, పలువురు రైతులు అడ్డుకొని ఎంపీ డౌన్‌డౌన్, గో బ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ జాతీయ రహదారిపై బైటాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన వెంటనే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయనని కేంద్రం చెప్పినా పట్టించుకోని ఎంపీ అరవింద్ మాటకారి అంటూ విమర్శించారు. ఎంపీ ఆయన నియోజకవర్గ అభివృద్ధికి నయాపైసా మంజూరు చేయలేదనీ, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.