Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని నాలుగు యూనివర్సీటీల వైస్చాన్స్లర్ల నియామకాల్ని తప్పుపడుతూ దాఖలైన రెండు పిల్స్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సర్వీస్ మ్యాటర్ వ్యవహారంపై పిల్ వేయడాన్న్లి చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ,జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ తప్పుపట్టింది.ఈ మేరకు బెంచ్ సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా సీహెచ్ గోపాల్‌రెడ్డి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా టి కిషన్‌రావు, జేఎన్ట ీయూ వీసీగా కె నరసింహారెడ్డి, కాకతీయ వర్సిటీ వీసీగా టి రమేష్‌లను నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్ని నిజామాబాద్‌కు చెందిన మాజీ ప్రిన్సిపాల్ జి విద్యాసాగర్‌రావు, ఏబీవీపీలు సవాల్ చేస్తూ పిల్స్ వేశాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీసీల నియామకాలపై పిల్ సరికాదని చెప్పింది.
ఎగ్జిబిషన్.. ఒమిక్రాన్ జాగ్రత్త
ఏటా హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈసారి చేయకుండా ఒమిక్రాన్ వ్యాప్తి కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు సోమవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి సూచనలు చేసింది. 2019లో ఎగ్జిబిషన్లో అగ్నిప్రమాదం సంభవించడం తర్వాత తీసుకున్న చర్యలను తప్పుపుడతూ ఖాజా ఐజూజుద్దీన్ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణ జరిపింది. ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ, అగ్నిమాపకశాఖల నుంచి పర్మిషన్లు తీసుకున్నామని సొసైటీ ప్రెసిడెంట్ మెమో దాఖలు చేశారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం చెప్పింది.
జగన్ బెయిల్‌పై రిట్లో ముగిసిన వాదనలు
ఆక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఎంపీ కె రఘురామకృష్ణంరాజు వేసిన రిట్‌పై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. రిట్‌పిటిషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో తీర్పులో చెబుతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చెప్పారు. 2013లో జగన్ బెయిల్ పొందితే ఎనిమిదేండ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌కు నోటీసు ఇవ్వమన్నారు. బెయిల్ ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆధారాలు లేవని సీబీఐ కోర్టు తేల్చిందనీ, హైకోర్టుకూ ఆధారాలు చూపడం లేదన్నారు. రిట్‌పై విచారణార్హత గురించి తర్వాత తీర్పు చెబుతామని సోమవారం హైకోర్టు వెల్లడించింది.
ఎల్ఐసీ చైర్మెన్‌కు కోర్టు ధిక్కార నోటీసులు
కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన కోర్టు ధిక్కార కేసులో ఎల్ఐసీ చైర్మెన్,ఇద్దరు అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో ఫిబ్రవరి 7నజరిగే విచారణకు స్వయ ంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఈ మేరకు ఎల్ఐసీ చైర్మెన్ ఎంఆర్ కుమార్,జోనల్,డివిజనల్ మేనేజర ్లకు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతత్వంలోని డివిజ న్ బెంచ్ సోమవారం నోటీసులు ఇచ్చింది. శ్రీనివాస్‌రావు ఇతరులు దాఖలు చేసిన కేసులో వారికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది1996లో 400ఉద్యోగాల భర్తీకి ఎల్ఐసీ నోటిఫి కషన్ ఇచ్చి 350 మందినే నియమించిందనీ, మిగిలిన వారిలో అర్హత ఉన్న వారిని నియమించాలని రెండేళ్ల క్రితం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.ఈ మేరకు పిటిషనర్లు దాఖలు చేసిన అప్లికేషన్లను ఎల్ఐసీ తిరస్కరించడంతో పిటిషనర్లు కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
బడిని ఇల్లు చేసుకున్న సర్పంచ్
కొమరం భీం జిల్లా తిర్యాని మండలం రాళ్లకన్నెపల్లిలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆ గ్రామ సర్పంచ్ ఎం గుణ్వంత్రావు కబ్జా చేసుకుని ఇంటిగా మార్చేసుకున్నారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. రాళ్లకన్నెపల్లి గ్రామస్తుడు వి భగ్వంత్రావు పిల్ వేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవనీ, బడిలో చదవాల్సిన పిల్లలు వేరే వాళ్ల ఇంట్లో చదుకోవాల్సిన దుస్థితి వచ్చిందని పిల్లో పేర్కొన్నారు.