Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి నుంచి రెండేండ్ల కార్యాచరణ
- ఎస్సీఆర్ఈఎస్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైల్వే పరిరక్షణకు రెండేండ్ల కార్యాచరణతో ఐక్య పోరాటానికి సిద్ధం అవుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ఎంప్లాయీస్ సంఫ్‌ు (ఎస్సీఆర్ఈఎస్) జనరల్ కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసింది. సోమవారంనాడిక్కడి రైల్‌కళారంగ్‌లో సంఫ్‌ు ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎమ్ రాఘవయ్య అధ్యక్షతన మూడు రోజుల జనరల్ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్‌మాల్యా దీనిని ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రాఘవయ్య పలు అంశాలపై మాట్లాడారు. రైల్వేను ప్రయివేటీకరించేందుకు కేంద్రప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. రైల్వేల అభివృద్ధి పేరుతో కేంద్రప్రభుత్వం 2020-21లో 1.55 లక్షల కోట్లు, 2021-22లో రూ.2.15 లక్షల కోట్లను పెట్టుబడిగా పెట్టిందనీ, దానినుంచి వచ్చిన ఆదాయాన్ని మాత్రం వెల్లడించట్లేదని అన్నారు. రైల్వేస్టేషన్ల ప్రయివేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పేరుతో కేంద్రప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చుచేసిందనీ, స్టేషన్ మొదటి అంతస్తులో ఫైవ్‌స్టార్ హౌటల్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. అవసరం లేనిచోట పెట్టుబడి పెట్టి, నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఇప్పుడు దాన్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. ఎయిర్ఇండియా మాదిరే రైల్వేనూ అమ్మకానికి పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.