Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు హర్షం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిటి ఆయోగ్ విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో రాష్ట్రం మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్యరంగం పురోగతిని విశ్లేషించి నిటి అయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కేరళ మొదటి స్థానంలో నిలువగా, తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. 2018-19లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలువగా తాజాగా మూడో స్థానానికి చేరుకుంది. ఆ రంగంలో పురోగమిస్తున్న రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో మంత్రి, కేసీఆర్ ప్రత్యేక దృష్టి, ప్రభుత్వ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఒక్కో వ్యక్తిపై వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తలసరి ఖర్చుల కేటగిరీలో రూ.1698 ఖర్చు చేస్తూ హిమాచల్ ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణ నిలవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.