Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ స్టాప్ కాలేజీ డైమాండ్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బెగంపేట్లోని సంస్థ కార్యలయంలో జరిగిన దీనికి ఎస్బిఐ ఛైర్మన్ దినేష్ ఖార ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ ఎండి (హెచ్ఆర్ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఓం ప్రకాశ్ మిశ్రా, డిప్యూటీ ఎండి (ఆడిట్) ఆర్ విశ్వనాథన్, సిజిఎం లక్ష్మీ ఆర్ శ్రీనివాస్, స్టాఫ్ కాలేజ్ జిఎం అండ్ డైరెక్టర్ విఆర్ మజూందర్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉద్యోగులను తీర్చిదిద్దడానికి 1961లో ఈ శిక్షణ సంస్థను ప్రారంభించారు. ఎస్బిఐతో పాటు ఇతర బ్యాంక్‌ల సిబ్బందికి,విదేశాల్లోని ఉద్యోగులకు ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నతాధికారులుగా ఎదిగారు. ఈ డైమాండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా 'లక్ష్యా సాధన' ఎన్‌జిఒకు దినేష్ ఖారా బస్సును అందించారు. క్యాంపస్‌లో మొక్కలు నాటారు.