Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల
హైదరాబాద్ : ప్రస్తుతం జరిగే ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదలాయింపులో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఒక రకంగా, బీసీ ఉద్యోగులకు ఇంకొక రకంగా నిబంధనలు పెట్టి బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివక్షత చూపిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. 317 జీవో తీసుకువచ్చి బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులను బలి తీసుకుంటున్నారని తెలిపారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయంపై జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని దిల్కుషా అతిథి గృహంలో జాతీయ బీసీ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అన్యాయాన్ని సరిదిద్దాలంటూ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారికి జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఎవరితో చర్చించకుండా జోనల్ పేరుతో 317 జీవో తీసుకువచ్చి సీఎస్.. ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని జాజుల అన్నారు. సీఎస్‌కు లేని స్థానికత, సీనియారిటీ.. ఉద్యోగులకెందుకు? అని ఆయన ప్రశ్నించారు.