Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం కోసం.. ధర్మం కోసం కేంద్రం ఆ పోస్టులు భర్తీ చేయాలి
- ప్రతి ఐదింటిలో ఒక ఉద్యోగం నింపలే : హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశం కోసం.... ధర్మం కోసం కేంద్రంలోని ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. సంజరు దీక్ష సందర్భంగా చేసిన కామెంట్లకు మంత్రి ట్వీట్ తో కౌంటరిచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో ప్రతి అయిదు ఉద్యోగాలకు గాను ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది సంజరు గారు అంటూ పేర్కొన్నారు. సాక్షత్తూ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ 2021 జూలై లో రాజ్యసభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో 8,72,243 ఖాళీలున్నాయని ప్రకటించారని గుర్తుచేశారు.