Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రమబద్ధీకరణ జీవో 16 అమలు సాధన సమితి : మంత్రులు హరీశ్‌రావు, సబితకు వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను జారీ చేయడంలో సహకరించాలని మంత్రులు టి హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డిని క్రమబద్ధీకరణ జీవో 16 అమలు సాధన సమితి కోరింది. ఈ మేరకు మంత్రులను సోమవారం హైదరాబాద్‌లో ఆసమితి రాష్ట్ర కన్వీనర్ కొప్పిశెట్టి సురేష్, గౌరవ సల హాదారులు అందెసత్యం, మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడం కోసం 2016లో జీవోనెంబర్ 16ను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. ఈవిషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలనీ, మార్గదర్శకాలు విడుదలయ్యేలా చూడాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. క్రమబద్ధీకరణకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిగ్లా ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్, అధ్యక్షులు ఎం జంగయ్య, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల నాయకులు జి రమణారెడ్డి, మనోహర్, నవీన్, వెంకట్‌రెడ్డి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.