Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి వద్దే రేవంత్ అరెస్ట్
- కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం
- రైతుకు ఉరిశిక్ష వేసిన టీఆర్ఎస్ సర్కార్ : టీపీసీసీ చీఫ్ ఫైర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గం గజ్వేల్‌లో నిర్వహించతలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరిన టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయకపోవటం, ఇదే సమయంలో కేసీఆర్ ఫాం హౌజ్‌లో వరిని పండించటాన్ని ఎండగట్టేం దుకు వీలుగా సోమవారం కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రేవంత్ ఇంటి చుట్టూ పోలీసులు కాపలా కాశారు. సోమవారం ఉదయం ఎర్రవల్లికి కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో నుంచి బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో రేవంత్‌ను బలవంతంగా అరెస్టు చేసిన పోలీ సులు అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయన అరెస్టు సందర్భంగా అడ్డుకునేందుకు ప్రయ త్నించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవిని పోలీసులు తోసేయడంతో కింద పడిపో యాడు. ఆయనకు స్వల్పంగా గాయలయ్యాయి. ఈ ఘర్షణల్లో రవి చొక్కా చిరిగిపోయింది. అనంతరం ఆయన్ను కూడా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
అధైర్య పడి ఆత్మహత్య చేసుకోవద్దు : రేవంత్
పోలీస్‌స్టేషన్ వద్ద రేవంత్మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ప్రభుత్వం రైతు లకు మూడు నెలల నుంచి ఉరిశిక్ష విధిస్తోందని విమర్శించారు. పండించిన పంట కొనుగోలు చేయక పోవడం వల్ల అన్నదాతలు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. చివరి గింజ వరకు పంటను కొనాలని డిమాండ్ చేశారు.