Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని యుజిసి ఏడో వేతనం ఇవ్వాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం. రామేశ్వరరావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ తదితరులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంగళవారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.