Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. . మంగళవారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని తెలిపారు. విభజన హామీలపై బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి నిరుద్యోగ సమస్యను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం అవుతాయనీ, ఏ రూపంలో కలిసి పనిచేయాలో సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు..ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.