Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పదాలు వాడటం తగదు
- టీపీసీసీ మహిళా విభాగం నాయకులకు ఐద్వా లేఖ
నవతలెంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళల ఆలోచనల్లో మార్పురావాలనీ, రాజకీయ విమర్శలు చేసేటప్పుడు మహిళలను కించపరిచే పదాలు వాడకూడదని ఐద్వా రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీసీసీ మహిళా విభాగం నాయకులకు మంగళవారం ఐద్వా ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి లేఖ రాశారు. ధాన్యం సమస్యపై ఢిల్లీకి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల, సమస్యను పక్కదారి పట్టిస్తున్న బీజేపీ మంత్రులను ఉద్దేశించి వాడిన పదజాలం అభ్యంతర కరంగా ఉందని తెలిపారు. చీరలు, గాజులు పంపుతున్నామంటూ చేసిన వ్యాఖ్యలు మహిళను కించపరిచేలా ఉన్నాయనీ, వారు బలహీనులనే అర్థాన్ని ఇస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మద్యపాన వ్యతిరేక పోరాటంలో మహిళలు తమదైన పాత్ర నిర్వహించారని గుర్తుచేశారు. బాల్య వివాహాల చట్టం, వరకట్న నిషేధ చట్టం లాంటి హక్కులను పోరాడి సాధించుకున్న చరిత్ర స్త్రీలకు ఉందని తెలిపారు. సైన్యంలో ,అంతరిక్షంలో ,భూగర్భంలో జరిగే అనేక పరిశోధనల్లో స్త్రీల పాత్ర విస్మరించలేనిదని పేర్కొన్నారు. బ్యాంకు, ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, క్రీడల్లో, చదువులో, అన్నింట్లో ముందున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇంతటి ప్రతిభకలిగిన మహిళలను.. చేతగాని వాళ్ళను విమర్శించటం కోసం గాజులు, చీరెలు ఉదహారించటం సరికాదన్నారు.