Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశం కోసం పుట్టినది కాంగ్రెస్ పార్టీనేనని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం గాంధీభవన్‌లో జరిగాయి. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ పార్టీ పారాడిందనీ, సర్వమత సామరస్యం, శాంతి సమరస్యాలతో దేశానికి ఒక దిశా నిర్దేశం చేసిందని గుర్తుచేశారు. అభివద్ధి ఫలాలను పేదలకు పంచిందనీ, బీడు పొలాల్లో బంగారం పండించిందని చెప్పారు. అలాంటి పార్టీని దెబ్బతీయాలని దుమ్మెత్తిపోయాలని చూసినా కాంగ్రెస్‌కు మట్టి కూడా అంటుకోదని స్పష్టం చేశారు. దేశంలో మతతత్వ రాజకీయాలతో బీజేపీ పబ్బం గడుపుకుంటున్నదని విమర్శించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ముందు నుంచే చీకటి ఒప్పందం ఉందని విమర్శించారు. అందుకే సింగరేణి కాలరీస్‌కు ఆనుకొని ఉన్న మైనింగ్‌పై ప్రయివేటు పార్టీకి ఆప్షన్ ఇచ్చినా టీఆర్ఎస్ నోరు మెదపడటం లేదని తెలిపారు. రైతులను సమాయత్తం చేయకుండా అకస్మాత్తుగా వరి వేయొద్దంటూ, పంటల మార్పిడి అంటూ కేసీఆర్ అనడం అవగాహనా రాహిత్యమని విమర్శించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మిల్లర్లతో కుమ్మక్కయ్యాయని విమర్శించారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిపై ఆధారపడ్డ పార్టీ అనీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఆధారంగా నడుస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వీ.హెచ్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాలెన్ని ఇచ్చారు..?: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు
శివసేనారెడ్డి సూటి ప్రశ్న
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయో చెప్పాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నిరుద్యోగ దీక్ష చేయటం దొంగే...దొంగ, దొంగ అని అరిచినట్టుగా ఉందని విమర్శించారు.
విభజన హామీలేవి?:పొన్నాల
రాష్ట్ర విభజన హామీల అమలేదని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ దీక్ష దొంగదని బీజేపీకి ఇప్పుడు గుర్తుకొచ్చిందని విమర్శించారు. విభజన హామీలపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
సీఎల్పీ మాజీ నేతకు నివాళులు
సీఎల్పీ మాజీ నేత పి.జనార్ధన్ రెడ్డి వర్దంతి సందర్భంగా గాంధీభవన్‌లో నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నాయకులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.