Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రావిర్భావ దినోత్సవమైన జూన్ రెండు నాటికి రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో కొత్తగా 288 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావుతో కలిసి వైద్య, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన 256 బస్తీ దవాఖానాలు పట్టణ పేదల వైద్య ఖర్చులను తగ్గించాయని తెలిపారు. వీటి స్ఫూర్తితో రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీల్లో 288 బస్తీ దవాఖానాలను రెండు దశల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటితో కలుపుకుని 544 బస్తీ దవాఖానాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కొత్త బస్తీ దవాఖానాల ఏర్పాటుకు జనాభా, వైద్య సేవల అందుబాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఐటీ శాఖ నుంచి వైద్యారోగ్యశాఖకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రం నిటి ఆయోగ్ ఆరోగ్య సూచిలో గతేడాది నాలుగో స్థానంలో ఉండగా, ఈ ఏడాది మూడో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు.