Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రమాదవ శాత్తు చనిపోయిన గీత వృత్తిదారుడి కుటుంబానికి టాడి కార్పొరేషన్ ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందించింది. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం లోయపల్లి గ్రామానికి చెందిన దోసపాటి రంగయ్య సోమవారం చెట్టుపైనుంచి జారి పడి చనిపోయారు. వారి దహన సంస్కారాల నిమిత్తం రూ. 25వేలు టాడి కార్పొరేషన్ నుండి ఆర్థిక సహాయాన్నిఏబీసీడిఓ పి. రమేష్, కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ రవీందర్ గౌడ్ రంగయ్య భార్య దోసపాటి బాలమణికి అందించారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి. రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు యు. వెంకట నరసయ్య , రంగారెడ్డి జిల్లా నాయకులు ఓరుగంటి బాబు, బోయపల్లి సుధాకర్, ముఖం వెంకటయ్య, బావికాడి జంగయ్య, బోయపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. విషయం తెలియగానేవెంటనే స్పందించి సహకారం చేసిన కార్పొరేషన్ చైర్మన్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, కార్పొరేషన్ యం.డి.ఉదరు ప్రకాష్‌కు కల్లు గీత కార్మిక సంఘం కృతజ్ఞతలు తెలిపింది.