Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
- పలు జిల్లాల్లో ముందస్తు అరెస్టులు
నవతెలంగాణ-విలేకరులు
జీఓ 317తో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపి న్యాయం చేయాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేస్తోంది. టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం చలో సెక్రటేరియట్ నిర్వహించారు. పలు జిల్లాల నుంచి చలో సెక్రటేరియట్ కోసం హైదరాబాద్ వస్తున్న ఆ సంఘం నాయకులు, ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు.
సిద్దిపేట జిల్లాలో హైదరాబాద్‌కు తరలుతున్న ఉపాధ్యాయులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ.. జీవో 315 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు సచివాలయ ముట్టడి చేపడితే ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది టీచర్లను తెల్లవారుజాము నుంచే అక్రమంగా నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్లు ఉపాధ్యాయులతో నిండిపోవడం ప్రభుత్వ దమనకాండకు అద్దం పడుతోందని తెలిపారు. అరెస్టులు, దిగ్బంధాలను చేధించుకొని సచివాలయాన్ని చేరుకోవడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఆయా జిల్లాల్లో ఉన్న స్థానిక ఉద్యోగులను జిల్లాకే కేటాయించాలని కోరారు. లేని యెడల ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జహీరాబాద్లోనూ ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో టూటౌన్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, కోశాధికారి రాజశేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మిర్యాలగూడలో యూటీఎఫ్ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో తహసీల్‌లోని డిప్యూటీ తహసీల్దార్ చెన్నమ్మకు వినతి పత్రం అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట డీపీఎఫ్, యూఎస్పీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు.