Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టు భూసేకరణను అడ్డుకున్న రైతులు
- కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ - బోయినిపల్లి
కాళేశ్వరం లింక్-2 ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు మరోచోట భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు భూసేకరణ కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎలా భూములు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లింక్-2 ప్రాజెక్టులో రైతులు కోల్పోతున్న భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ యుగంధర్, ఎస్ఐ అభిలాష్ ఘటనా స్థలానికి చేరుకుని సహకరించాలని రైతులను కోరగా.. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు భూసేకరణకు అధికారులు రావొద్దని తేల్చిచెప్పారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు.