Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సీఎస్ఐఆర్- సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలాజీ (సీసీఎంబీ)కి ఎస్బీఐ ఫౌండేషన్ ఏకంగా రూ.9.94 కోట్ల విరాళం అందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ మొత్తం విలువ చేసే చెక్కును ఆ బ్యాంక్ ఛైర్మన్ దినేష్ ఖారా మంగళవారం హైదరాబాద్‌లో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినరు కుమార్ నందికూరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ బ్యాంక్ డిప్యూటీ ఎండీలు ఒపి మిశ్రా, ఆర్ విశ్వనాథన్, ఎస్బీఐ పౌండేషన్ ఎండీ మంజుల కల్యాణ సుందరం పాల్గొన్నారు. ఈ నిధులను కోవిడ్ తరహా వైరస్ల డాటాను విశ్లేషించడానికి రెండు శాటిలైట్ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా సీసీఎంబీకి అందించింది. మానవాళి ఎదుర్కొంటున్న కోవిడ్ వైరస్‌పై పోరాడాల్సిన అవసరం ఉందని ఖారా తెలిపారు. అణగారిన వర్గాల వారికి సామాజిక సృహతో ఎస్బీఐ ఫౌండేషన్ సాయం కొనసాగిస్తుందన్నారు.