Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మానకొండూర్
కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న రెండు బాల్య వివాహాలను సీడీపీవోలు అడ్డుకున్నారు. ఈ ఘటన మానకొండూర్ మండలం శ్రీనివాసనగర్, కరీంనగర్ రూరల్ మండలం రేకుర్తి గ్రామాల్లో మంగళవారం చోటుచేసుకుంది. సీడీపీవోలు సబిత, ఉమారాణి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం రేకుర్తి గ్రామ బుడగజంగల కాలనీ, మానకొండూర్ మండలం శ్రీనివాస నగర్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. దాంతో రూరల్ సీడీపీఓ సబిత, అర్బన్ సీడీపీఓ ఉమా రాణి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ సంపత్తో కలిసి వెళ్లి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, వివాహ వయసు వచ్చే వరకు పెండ్లీ చేయబోమని వారితో హామీ పత్రం తీసుకున్నారు. తర్వాత అమ్మాయి చదువుతున్న స్కూల్‌కి వెళ్లి ప్రిన్సిపాల్‌తో మాట్లాడి చదువు కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీపీఎస్ రమేష్, చైల్డ్ లైన్ సాయికిరణ్, బ్లూ కోర్ట్ పోలీస్, చర్చ్ పాస్టర్ నేతనాయల్, తదితరులు పాల్గొన్నారు.