Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోదావరిపై నిర్మించే ఆరు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి
- కేంద్రానికి సీఎస్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అక్టోబరు ఆరున తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఐఎస్ఆర్డబ్ల్యూడ లోీని 1956 చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యు నల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. రిఫర్ చేయడానికి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారనీ, ఇందుకను గుణంగా తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి కేసును ఉపసంహరించుకున్న నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ఈ అంశానికి సంబంధించి భారత ప్రభుత్వ న్యాయ శాఖ అభిప్రాయానికి పంపామనీ, అక్కడి నుంచి నివేదిక రాగానే ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌కు సిఫారసు చేయ నున్నట్టు కేంద్ర కార్యదర్శి పంకజ్‌కుమార్ స్పష్టం చేశారు. కష్ణా, గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించి ఆగస్టు ఏడున విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని ఆయా అంశాల అమలుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు గోదావరినదిపై సీతారామ ఎల్ఐఎస్, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం ప్రాజెక్ట్), ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎల్ఐఎస్, చౌట్పల్లి హనుమంతరెడ్డి ఎల్ఐఎస్, మోడికుంటవాగు ప్రాజెక్టు, చనాక-కొరాట బ్యారేజీకి సంబంధించిన ఆరు సవివర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) అనుమతులకై సెప్టెంబర్ 2021లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిదనీ, కేంద్ర జల సంఘము వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ప్రధానకార్యదర్శి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో ప్రతి విన్నపాన్నీ పరిశీలించి త్వరలోనే అనుమతి ఇస్తామని జలశక్తి కార్యదర్శి హామీ ఇచ్చారు. గోదావరి బేసిన్‌లోని మరో ఐదు ప్రాజెక్టులు - రామప్ప-పాకాల లింక్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ (రోజుకు అదనంగా ఒక టీఎంసీ), కందకుర్తి ఎల్ఎస్ స్కీమ్, గూడెం ఎల్ఎస్ , పీవీ నర్సింహారావు కంతనపల్లి బ్యారేజీ ప్రాజెక్టును, అనామోదిత ప్రాజెక్టుల జాబి తాలో తప్పుగా చేర్చడం జరిగిందనీ, గోదావరీ నదీ యాజమాన్య బోర్డు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నుంచి ఈ ఐదు ప్రాజెక్టులను అనామోదిత ప్రాజెక్ట్‌ల జాబితా నుంచి తొలగించాలని సోమేశ్ కుమార్ కేంద్ర కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. గోదావరి నదిపై నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య పెద్దగా సమస్యలు, ఉమ్మడి ప్రాజెక్టులు లేని కారణంగా ప్రత్యేకంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ హామీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, సంయుక్త కార్యదర్శి సంజరు అవస్తీ, తెలంగాణా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఇరిగేషన్ (జనరల్) ఈ.ఎన్.సి సి. మురళీధర్, ఈ.ఎన్.సి గజ్వేల్ హరిరామ్, ముఖ్యమంత్రి కార్యాలయం ఓ.ఎస్.డి. శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు.