Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో 7వేల మందికిపైగా శిక్షణ
- విద్యనభ్యసించిన వాళ్లకు 90శాతం ఉద్యోగాలు
- ఆరుసార్లు గోల్డెన్ పీకాక్ అవార్డులు :ఈస్కీ డైరెక్టర్ జి.రామేశ్వర్రావు
'దేశంలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ) అతిపెద్ద స్వయం ప్రతిపత్తి కల్గిన సంస్థ. ఇది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా)కు అనుబంధంగా పనిచేస్తోంది. ఈఎస్సీఐని 1981లో ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఇంజినీరింగ్, టెక్నాలజీ మేనేజ్మెంట్ విభాగాల్లో నాణ్యమైన విద్య, శిక్షణ ఇస్తోంది. ఆసియాలో ఇంజినీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగంతోపాటు మేనేజ్‌మెంట్‌లోనూ శిక్షణ ఇస్తున్న ఒకే సంస్థ 'ఈఎస్ఐసీ' అని డైరెక్టర్ జి.రామేశ్వర్రావు అన్నారు. 'నవతెలంగాణ' ప్రతినిధి నిరంజన్ కొప్పుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో పలు విషయాలు వెల్లడించారు.
ఏడాదిలో ఎంత మందికి శిక్షణ ఇస్తున్నారు?
ఇంజినీరింగ్, టెక్నాలజీ, టెక్నో మేనేజ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజినీరింగ్‌లో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడంతోపాటు ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన భాగమైన ఉత్పత్తి రంగానికి ఊతమిచ్చే కొత్త ఆవిష్కరణలకు రూపకల్పన చేస్తున్నాం. ప్రతి ఏడాదీ 300-350 శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. ఏడాది కాలంలో ప్రభుత్వ, ప్రయివేటు, విద్యాసంస్థలు, ఇతర రంగాలకు చెందిన 7వేల మందికిపైగా ఇంజినీర్లు, మేనేజర్లకు శిక్షణ ఇస్తున్నాం.
అంతర్జాతీయ ఒప్పందాలు?
ప్రపంచ బ్యాంకుతోపాటు యునెస్కో, యునిసెఫ్ లాంటి సంస్థలకు సంబంధించిన అసైన్మెంట్స్ కూడా చేస్తున్నాం. వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్(డబ్ల్యూఎంసీ), వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూఎఫ్ఈసీ), కామన్వెల్త్ ఇంజినీర్స్ కౌన్సిల్(సీఈసీ), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డు బీటన్(ఎఫ్ఐబీ), ఫెడరేషన్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సౌంత్ అండ్ సెంట్రల్ ఏసియా(ఎఫ్ఈఐఎస్సీఏ) అంతర్జాతీయ సంస్థలతో ఈఎస్సీఐ ఒప్పందాలు చేసుకుంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వచ్ఛభారత్ మిషన్, రూరల్ వాటర్ సప్లై, సాంప్రదాయ ఇంధన, స్కిల్ డవలప్మెంట్ విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాం. వాతావరణ మార్పులు, ఇంటలిజెంట్ బిల్డింగ్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్ వంటి కార్యక్రమాలో కీలక భాగస్వామిగా ఉన్నాం.
ఏఐసీటీఈ గుర్తింపు ఉందా?
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఈఎస్సీఐ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్(ఎస్పీజీఎస్) నేతృత్వంలో రెండేండ్ల పీజీడీఎం కోర్సులను సైతం నిర్వహిస్తున్నాం. పీజీడీఎం, పీజీడీఎం(ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్)తోపాటు ఫైనాన్స్, హెచ్ఆర్ఎం, మార్కెటింగ్ కోర్సులను నిర్వహిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్మెంట్, పరిశ్రమల రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా కోర్సులను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ వస్తున్నాం.
ఎంత మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి?
ఈఎస్సీఐ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్(ఎస్పీజీఎస్) రెండేండ్ల కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల్లో 90శాతం మంది ఉద్యోగాలు సాధించారు. దీనికి నాణ్యమైన వృత్తి విద్యతోపాటు శిక్షణ ఇవ్వడమే కారణం. విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖులతో పాఠాలు చెప్పించడంతోపాటు సెమినార్స్, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిఫ్ నిర్వహించడం బాగా కలిస్తోంది.
ఎన్ని సంస్థల్లో ఎన్ప్యానల్ ఎజెన్సీగా ఉంది?
వృతి విద్య శిక్షణతోపాటు పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతోపాటు అన్ని రాష్ట్రాల్లో థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్, మానిటరింగ్, ఆడిటింగ్ ఏజెన్సీగా పనిచేస్తోంది. దీంతోపాటు డీపీఆర్‌లను సైతం తయారు చేస్తున్నాం.
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సైంటిఫిక్ అండ్ ఇండిస్టీయల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సీఐఆర్ఓ), సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ, కేంద్ర రోడ్డు, రవాణ, జాతీయ రహదారుల శాఖ, కేంద్ర వాటర్ సప్లై, డిపార్ట్మెంట్ సైన్స్, టెక్నాలజీ అండ్ దేశంలోని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం రూపకల్పనలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాం.
కేంద్ర విద్యుత్ శాఖలో ఎంప్యానల్ ఎజెన్సీగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీన్ కౌశల్య యోజన(డీడీయూ-జీకేవై) నమోదు సంస్థగా పనిచేస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జల్‌జీవన్ మిషన్‌లో కీ రీసోర్స్ సెంటర్లో ప్రధాన భాగస్వామిగా ఉన్నాం.
ఎన్ని గోల్డెన్ పీకాక్ అవార్డులు వచ్చాయి?
ఈఎస్సీఐ సేవలను గుర్తించి ఆరుసార్లు గోల్డెన్ పీకాక్ అవార్డులు అందజేశారు. 2007, 2008, 2010, 2011, 2012, 2021ల్లో ఆవార్డులను సాధించాం. ఏఐసీటీఈ గుర్తింపుతోపాటు లాబోరేటరీలకు ఎన్ఏబీఎల్ గుర్తింపుతోపాటు సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు సైతం ఉంది.