Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ మార్కెట్లో రికార్డు ధర..
నవ తెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తికి రికా ర్డుధర పలికింది. మార్కెట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్వింటాల్ ధర రూ.8715 పలికింది. జనగామజిల్లా పాలకుర్తిమండలం గూడూరు గ్రామానికి చెందిన రైతు బెల్లి మల్లేశం 27 బస్తాల పత్తి తీసుకు రాగా, వేణుగోపాల స్వామి ట్రేడర్స్ ఆడ్తి ద్వారా అశోక్ కాటన్ ఇండిస్టీస్ ఖరీదుదారు రూ. 8715 ధర పెట్టి కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పత్తికి మంచి ధర వస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మార్కెట్కు సుమారుగా పదివేల బస్తాల పత్తి వచ్చింది. కనీస ధర రూ.7,200 పలుకగా, గరిష్ట ధర రూ.8715 పలికింది. ఇటీవల పత్తి క్వింటాల్ ధర సగటును ఏడు వేలు పలికింది.